Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ఆత్మహత్య
నవతెలంగాణ-హవేళిఘనపూర్
సన్న వడ్లకు ధర లేక.. ఆసరా పింఛన్ రాక.. అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడి వైద్య ఖర్చులు భరించలేక తీవ్ర మనోవేదనకు గురైన ఓ రైతు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం బోగడ భూపతిపూర్‌లో శుక్రవారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు కర్ణం రవి(40) తనకున్న మూడెకరాల వ్యవసాయ భూమిలో గతంలో వరి సాగు చేసి నష్టపోయాడు. దాంతో 35 గుంటల భూమిని అమ్మి అప్పు తీర్చాడు. మరలా అప్పు చేసి ఇటీవల సన్నరకం వరి సాగు చేశాడు. కానీ సరైన ధర రాకపోవడంతో పెట్టిన పెట్టుబడీ చేతికందలేదు. దీనికి తోడు కుమారుడు కృష్ణ హిమోఫిలియా వ్యాధితో బాధపడుతుండగా వైద్యానికి నెలకు రూ.6 వేలు ఖర్చు పెడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు రవి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య పెంటమ్మ, కుమారుడు, కుమార్తె ఉమాదేవి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ రాజయ్య, ప్రజా ప్రతినిధులు కోరారు.