Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13 నుంచి ఆందోళనలు : కార్మిక జేఏసీ పిలుపు
నవతెలంగాణ-కంఠేశ్వర్
గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.19వేలు చెల్లించాలని ఈనెల 13, 14, 15 తేదీల్లో చేపట్టే ధర్నాలను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దాస్ మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే పర్మినెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్, కాంటిజెంట్ సిబ్బందితో పాటు స్కీమ్ వర్కర్లకు కూడా ప్రభుత్వం వేతనాలు పెంచిందని, కానీ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందికి మాత్రం పెంచలేదని అన్నారు.గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, నర్సరీ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్లు, వాటర్ సప్లరు కార్మికులు, వీధిదీపాల నిర్వహణ కార్మికులు, ఆఫీసు నిర్వహణ సిబ్బంది, కారోబార్, బిల్ కలెక్టర్లను కేటగిరీల వారీగా వేతనాలు పెంచాలన్నారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధన్, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు జేపీ గంగాధర్, సాయిరెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకులు రాములు తదితరులు పాల్గొన్నారు.