Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ త్వరితగతిన నిర్మించి విజయవంతంగా నిర్వహిస్తున్న సోలార్ ప్లాంట్లకు జాతీయ స్థాయిలో సోలార్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. ఏషియన్ పసిఫిక్, ఆఫ్రికన్ దేశాల్లో సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహిస్తూ అవార్డులను అందించే సోలార్ క్వార్టర్ అనే సంస్థ న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును సింగరేణి జీఎం (సోలార్) సూర్యనారాయణరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలో మొదటి, రెండు దశల్లో మొత్తం 209 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయగా, వీటి ద్వారా నవంబరు నెలాఖరు నాటికి 166 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందనీ, తద్వారా కంపెనీకి రూ.85 కోట్లు ఆదా అయినట్టు వివరించారు. అవార్డు రావడంపై సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు.