Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండ్ల కూల్చివేతకు ఎంఐఎం నేతలు, అధికారులదే బాధ్యత : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మహమ్మద్ అబ్బాస్
- కలెక్టరేట్ ఎదుట బాధిత కుటుంబీకుల ధర్నా
నవతెలంగాణ-కంఠేశ్వర్
ముస్లిమ్‌ల సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని, తామే ప్రతినిధులమని విర్రవీగుతున్న ఎంఐఎం నేతల భూదాహానికి నిరుపేదలు బలి చేస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మహమ్మద్ అబ్బాస్ ప్రశ్నించారు. ఎంఐఎం నేతల రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ కాలనీలో ఇండ్లు కోల్పోయిన వారి ఆందోళనకు సీపీఐ(ఎం) మద్దతుగా నిలిచింది.శనివారం చలో కలెక్టరేట్ చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివెళ్లారు. లోనికి వెళ్లకుండా అడ్డుకునేందుకు గేట్లు మూసేయడంతో నాయకులు చొచ్పుకుపోయే ప్రయత్న ం చేయగా,ఉద్రిక్తత నెలకొంది.అనంతరం కలెక్టరేట్ ఏవో సుదర్శన్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మహమ్మద్ అబ్బాస్ మాట్లాడు తూ..ఎంఐఎం అధినేతలు అసదుద్దీన్ ఓవైసీకి నిజామాబాద్‌లో ఆ పార్టీ నేతల వ్యవహారం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కూల్చిన ఇండ్లకు ఎంఐఎం నేతలు,అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.బాధిత కుటుంబీకులు ఇండ్లు కోల్పోయి వారం రోజులు గడుస్తున్నా అధికారులుగానీ ప్రజాప్రతినిధులుగానీ ఎందుకు వారివైపు కన్నెత్తి చూడటం లేదని ప్రశ్నించారు.తీవ్రమైన చలిలో వారం రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నా స్పందించకపోవడం సరికాదన్నారు.ధర్మపురి హిల్స్ కాలనీలో లేఅవుట్ ఉన్న ప్రభుత్వ ప్లాట్లను కాపాడాలని,ఇల్లు కట్టుకొన్న వారికి ఇంటి నెంబరు, తాగునీరు నల్లా కనెక్షన్,కరెంటు స్తంభాలు, మీటర్లు, రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.అధికారులు స్పందిం చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని,హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. నిరసనలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు, నగర కమిటీ కార్యర్శి మల్యాల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.