Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భర్త వేధింపులే కారణం..
- రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఘటన
నవతెలంగాణ- రాజేంద్రనగర్
నిత్యం భర్త పెట్టే వేధింపులతో విసిగిపోయిన భార్య.. ఇద్దరు పిల్లల్ని గొంతు నులిమి చంపి,ఆ తర్వాత ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రంగా రెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఉప్పర్‌పల్లి ఫోర్ట్‌వ్యూ కాలనీకి చెందిన సాయి, స్వాతి(33)భార్యాభర్తలు.వీరికి తన్వీక్(5), శ్రీయ(4) సంతానం. సాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.అయితే కొంత కాలంగా సాయి భార్యను తీవ్రంగా హింసిస్తున్నాడు.నిత్యం ఏదో ఒక విషయంలో గొడవ పెట్టుకునేవా డు. శనివారం మధ్యాహ్నం కూడా భర్త తీవ్రంగా వేధించడంతో స్వాతి తన ఇద్దరు పిల్లలను తీసుకొని గదిలోకి వెళ్లింది. 'నా భర్త వేధింపులు తట్టుకోలేక నేను చనిపోతున్నాను' అని గోడపై రాసింది. పిల్లల్ని గొంతు నులిమి చంపి, వాళ్లు చనిపోయారని నిర్ధారించుకున్నాక ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఆ సమయం లో ఇంట్లో ఉన్న సాయి..పిల్లలు,భార్య చనిపోయారన్న విషయం తెలుసుకొని పరారయ్యాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే రాజేంద్రనగర్ పోలీసుల కు సమాచారం అందించారు. రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, సీఐ కనకయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్వాతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సాయి కోసం గాలిస్తున్నారు.