Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగారం విలువ రూ.3.6 కోట్లు
నవతెలంగాణ- శంషాబాద్
దుబాయ్ నుంచి హైదరాబాద్ ఆర్జీఐ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన నలుగురు సూడాన్ దేశానికి చెందిన ప్రయాణికుల నుంచి దాదాపు రూ.3.6 కోట్ల విలువైన 7 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సూడాన్‌కు చెందిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు హైదరాబాద్‌కు వచ్చారు. వారిపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రయాణీకులు పురుషనాళం లోపల బంగారు కడ్డీలు, బంగారాన్ని పేస్ట్ రూపంలో దాచిపెట్టారు. వారి నుంచి మొత్తం 7.3 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.3.6 కోట్లుగా నిర్ధారించారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.