Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణిపై ఆ పార్టీ భరతం పడతాం : బాల్క సుమన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సింగరేణిలాంటి ప్రతిష్టాత్మక సంస్థను ప్రయివేటీకరించేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీపై తిరగబడాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కార్మిక వర్గానికి సూచించారు. బొగ్గు బ్లాకుల ప్రయివేటీకరణ యత్నాలను విరమించుకోకపోతే ఆ పార్టీ భరతం పడతామని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రభుత్వ ప్రభుత్వరంగ సంస్థల కమిటీ చైర్మెన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి సుమన్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఇప్పటిదాకా రైతులను ఇబ్బందిపెట్టిన కేంద్రం.. ఇప్పుడు సింగరేణి కార్మికులను వేధిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. లాభాలొచ్చే సంస్థల జాబితాలో సింగరేణి టాప్‌టెన్‌లో ఉందని చెప్పారు. అలాంటి సంస్థను ప్రయివేటీకరించేందుకు ప్రయత్నించటం శోచనీయమని అన్నారు. బొగ్గు బ్లాకులను ప్రయివేటు వారికి అప్పజెప్పొద్దంటూ ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రధాని మోడీకి లేఖ రాసినా పట్టించుకోకపోవటం దారుణమన్నారు.