Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి
- వీఆర్ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు
నవతెలంగాణ-బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్గాం వీఆర్ఏ గౌతమ్‌ను ముమ్మాటికీ ఇసుక మాఫియానే హత్య చేసిందని వీఆర్ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు అన్నారు. శనివారం ఆయన బోధన్ మండలం ఖండ్గాం గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంతో ఆ గ్రామ ప్రజా ప్రతినిధి సోదరుడు, బంధువులు వీఆర్ఏను హత్య చేశారన్నారు. పోలీసులు సంతకాలు చేయాలంటూ మృతుని భార్యను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.నిందితులను కఠినంగా శిక్షించి, వీఆర్ఏలకు రక్షణ కల్పించాలని కోరారు. హత్యా కేసును పోలీసులు మసి పూసి మారేడు కాయలా తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమరి ్శంచారు.ఈ హత్యకు ఇతర కారణాలు అంటగడుతూ కేసును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ హత్యను వీఆర్ఏల రాష్ట్ర సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. గౌతం మృతితో భార్య, పిల్లలు ఆసరా కరువై వీధిన పడ్డారని, ప్రభుత్వం తక్షణమే ఆ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరిం చారు. నిబంధనల ప్రకారం 1849 సర్వీస్ రూల్స్ 15 పాయింట్లో వీఆర్ఏలతో వాచ్మెన్ డ్యూటీలు, అటెండర్ డ్యూటీలు, సొంత పనులు చేయించరాదని ఉన్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నిబంధనలకు విరుద్దంగా డ్యూటీలు వేస్తున్న రెవెన్యూ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, జిల్లా సహాయ కార్యదర్శి శంకర్‌గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఏశాల గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు లింగం, నాయకులు జంగం గంగాధర్ ఉన్నారు.