Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంచనాలు పెంచారు...అవినీతికి పాల్పడ్డారు :రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రపంచం ఆశ్చర్యపోయేలా అమరవీరుల స్థూపం నిర్మిస్తామని చెప్పి మూడేండ్లుగా ఆలస్యం చేశారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు.మొండిగోడలుగా అమరవీరులస్థూపం తయారైందని తెలిపారు. రూ 60 కోట్ల అంచనాలు పెంచి రూ 180 కోట్లకు పెంచి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పక్కనే ఉన్న సచివాలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్ దసరా లోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారనీ, అమరవీరుల స్థూపాన్ని పూర్తి చేయాలని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కొత్త సచివాలయానికి ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం నిర్మాణాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం తనను కలిసిన విలేకర్లతో రేవంత్ మాట్లాడారు. పొద్దుటూర్‌కు చెందిన కామిశెట్టి పుల్లయ్య కంపెనీకి ఎటువంటి అనుభవం లేకున్నా ఆ స్థూపాన్ని అప్పగించారని విమర్శించారు. రేకులు...ఇనుముతో కట్టిన నిర్మాణానికి రూ 180 కోట్లకు వ్యయాన్ని పెంచారని ఆరోపించారు. పిడికెడు ఆంధ్రా కాంట్రాక్టర్లు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని చెప్పారు. కాంట్రాక్టులు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి ఇస్తున్నారంటే, కేసీఆర్‌కు డీఎన్ఏ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే అసలు విషయం బయటకొస్తుందని తెలిపారు.
క్రిస్టియన్ మిషనరీల కృషి అభినందనీయం
విద్యా, వైద్య రంగాల అభివృద్ధిలో క్రిస్టియన్ మిషనరీల కషి అభినందనీయమనీ టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం అందించడంలో క్రిస్టియన్ సంస్థలు బాగా పని చేస్తున్నాయని కొనియాడారు. శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, నాయకులుó దాసోజు శ్రవణ్, అనిల్‌కుమార్ యాదవ్, ఏఐసీసీ మైనార్టీ విభాగం కో కన్వీనర్ అనిల్ థామస్ తదితరులు పాల్గొన్నారు.