Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రా'ధాన్యం'
- నూతన విద్యుత్ బిల్లు వెనక్కు తీసుకోవాలి...
- టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి
- 'నవతెలంగాణ ప్రతినిధి'తో టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరి మారేంత వరకు పార్లమెంట్‌లోపల బయట తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో అలుపెరగకుండా పోరాడుతామన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే ఎటువంటి చర్యలనైనా ఖండిస్తాం....పోరాడుతామన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల తరపున పార్లమెంట్లో పోరాటం చేశామన్న నామ నాగేశ్వరరావు.. శనివారం 'నవతెలంగాణ'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు. వివరాలు ఎంపీ నామ మాటల్లోనే...
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి స్పష్టతలేదు..
ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొమ్మిది రోజుల పాటు కేంద్రంపై పోరాటం చేశాం. ధాన్యం విషయంలో రెండు అంశాలను పార్లమెంట్ ముందుంచాం. రైతు పండించిన పంటను పూర్తిగా కొనాలి.యాసంగి ధాన్యం కొనమని అడుగుతున్నాం.బాయిల్డ్ రైస్ నూక వస్తుంది అందుకని కొనమని అంటున్నారు..అదే విషయాన్ని పార్లమెంట్లో చెప్పమని మేము అడిగాం. ఒక సంవత్సరం లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో స్పష్టచేయమని రెండో డిమాండ్ చేశాం. కానీ మేము అడిగిన దేనికి కూడా సమాధానం ఇవ్వలేదు. రైతు, ప్రజా, కార్మిక వ్యతిరేక ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. రైతాంగం గురించి పట్టించుకోని ప్రభుత్వంలో, రైతు సమస ్యలపై చర్చించేందుకు ఇష్టపడనప్పుడు సభలో ఎందుకనే ఉద్దేశంతోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బైకాట్ చేశాం. కేవలం బిల్లులు పాస్ చేసుకోవడానికి, వ్యాపారాత్మక ధోరణితో కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప ప్రజా సమస్యలపై ఎక్కడ కూడా ఆలోచన చేయడం లేదు.
స్వామినాథన్ సిఫారసులు, ఎంఎస్పీపై..
పార్లమెంట్లో లేవనెత్తిన అంశాల్లో ఎంఎస్పీ (కనీస మద్దతు ధర) కూడా ఒకటి. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఎంత మొత్తంలో పంట ఉత్పత్తులు కొంటారో స్పష్టం చేయాలని కోరాం. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తున్నామని చెబుతూనే...దీనిలోని గణాంకాలలో గందరగోళం సృష్టిస్తున్నారు. అందుకే పంటలకు ఎంఎస్పీ రావట్లేదు. కాబట్టి ఎంఎస్పీపై స్పష్టత ఇవ్వాలని కోరాం. రైతు వ్యతిరేక సాగు చట్టాల మూలంగా రైతాంగం దాదాపు 13 నెలలు రోడ్లు ఎక్కాల్సి వచ్చింది. ఈ మూడు బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడే టీఆర్ఎస్ వ్యతిరేకించింది. మెజార్టీ ఉందనే కారణంతో ఏకపక్షంగా బిల్లులు చేశారు. దేశవ్యాప్తంగా రైతాంగం వీటిపై పోరాడే సరికి...తలొగ్గి మళ్లీ పార్లమెంట్లో ఈ బిల్లులు వెనక్కు తీసుకున్నారు.
నూతన విద్యుత్ చట్టాన్నీ వెనక్కు తీసుకోవాలి..
నూతన విద్యుత్ చట్టం ఎంతో ప్రమాదకరం. ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఇది తీరని ముప్పు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రైతు పక్షపాతి కాబట్టి వ్యవసాయానికి 24గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చారు.ఈ బిల్లును కేంద్రం వెనక్కు తీసుకోకపోతే రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇచ్చే వెసులుబాటు ఉండదు.కాబట్టి విద్యుత్ బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రైతుల సమస్యల పరిష్కారానికే తమ పార్టీ ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
కేంద్రం నియంతృత్వ వైఖరి వీడాలి..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించడం ద్వారా నియంతృత్వ వైఖరితో ఉన్న కేంద్రం విధానాల్లో మార్పు వస్తుందని అనుకోవడం లేదు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రబీలో వరి వేయొద్దని మేము చెప్పామా? అంటారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి రెండో పంట వేయొద్దంటారు. మన రాష్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రి ప్రతీ గింజ కొంటామంటారు. ఒక్కొక్క కేంద్ర మంత్రి ఒక్కో ప్రకటన చేయడం వల్ల రైతాంగాన్ని గందరగోళం చేయడం తప్పితే మరేమీ లేదు. నీళ్లు, కరెంట్, రైతుబంధు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుపక్షపాతిగా ఉంటే...రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే కేంద్రం విధానాలు ఇబ్బందికరంగా పరిణమించాయి.
ఎంపీ ల్యాడ్స్ నిధులూ ఆపారు..
స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంపీ ల్యాడ్స్ నిధులు ఎప్పుడూ ఆపలేదు.కరోనాను అడ్డుపెట్టి ప్ర స్తుత కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.రాష్ట్రాల్లో కరోనా నియ ంత్రణకు ఎంపీ ల్యాడ్స్ నిధులు వినియోగిస్తామన్నా కూడా ఇవ్వలేదు.గెలిచాక తొలి ఏడాది స్వల్ప మొత్తంలో ఎంపీ ల్యా డ్స్ నిధులు వచ్చాయి.ఎంపీలందరూ వీటికోసం డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇస్తారేమోననే ఆశాభావంతో ఉన్నాం.