Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలో ఉపరాష్ట్రపతి
- కూరెళ్ల విఠలాచార్య, కళాకృష్ణకు విశిష్ట పురస్కారాలు అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో పరిపాలనా భాషలుగా మాతృభాషలే ఉండాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. పరాయి పాలకులు మన భాష సంస్కృతుల పట్ల ఓ ప్రతికూల భావాన్ని, ఆత్మన్యూనతను మన మనసుల్లో నాటే ప్రయత్నం చేశారనీ, కొందరు వాటిని గుడ్డిగా అనుసరించడం బాధాకరమన్నారు. ఉదయం లేస్తే అర్ధరాత్రి వరకూ సెల్ఫోన్లలో లీనమై పోవడం వల్ల రోగాల పాలు కావడమే కాకుండా జీవితంలో ఒక లక్ష్యమంటూ లేకుండా పోతుందని హెచ్చరించారు. చదువు, దేశ, భాషాభివృద్ధి, పరిశోధనా రంగం వైపు యువత దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని నాంపల్లిలో గల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాయల వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2018, 2019 ఏడాదిలకుగానూ కవి, విమర్శకుడు డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య, కూచిపూడి నాట్యాచార్యులు కళాకృష్ణలకు తెలుగు యూనివర్సిటీ విశిష్ట పురస్కారాలను అందజేశారు.