Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కజ్జర్ల సమస్యపై ప్రభుత్వానికి లేఖ రాస్తా..
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎంపీ బాబురావు
నవతెలంగాణ-తలమడుగు
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో ప్రభుత్వం పేదలను ఇచ్చిన భూమిని పార్కు పేరుతో తిరిగి లాక్కోవడం సరికాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. ఆదివారం తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో భూ పోరాట బాధితులు చేపడుతున్న దీక్షలను ఆయన సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ నిరసన తెలుపుతున్న పలువురు పేదలు.. వారి సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. 1999లో ప్రభుత్వం జారీ చేసిన పట్టాలు చూపించారు. అనంతరం వారితో కలిసి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. గతంలో నివాసయోగ్యం కాని గుట్టలు, రాళ్లు ఉన్న భూమిని పేదలకు ఇవ్వడంతో వారు ఇండ్లు నిర్మించుకోలేదని తెలిపారు. స్థలం చదును అవుతుందనే ఉద్దేశంతో ఓ ప్రయివేటు కంపెనీకి అప్పగించారని వివరించారు. తీరా చదునైన తర్వాత అధికారులు ఆ భూమిలో బృహత్ పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేస్తామని సిద్ధం కావడం శోచనీయమన్నారు. సమీపంలోనే ఇతర అసైన్డ్ భూమి ఉన్నప్పటికీ కేవలం పేదలకు చెందిన భూమిని తీసుకోవడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ విషయంపై మాజీ ఎంపీ హోదాలో ప్రభుత్వానికి లేఖ రాస్తానని హామీనిచ్చారు.