Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఏఎస్ అధికారుల అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కొన్ని టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్‌ల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కలెక్టర్ విలువను తగ్గించడమే కాకుండా మహిళా అధికారి గౌరవాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించింది. మారుమూల జిల్లాలో పనిచేస్తున్న ఓ నిజాయితీ ఆఫీసర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో పనిచేసే అధికారులందర్నీ నిరుత్సాహానికి గురుచేస్తుందని అభిప్రాయపడింది. మహిళా అధికారిపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన గోనెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరింది.