Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డికి టీపీటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్థానిక క్యాడర్ల కేటాయింపుల్లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయుల విభజనలో స్థానికతను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్(టీపీటీయూ) రాష్ట్ర అధ్యక్షులు మట్టపల్లి రాధాకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్లో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమెకు టీపీటీయూ నేతలు వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లా స్థాయి పోస్టుల్లో ఉపాధ్యాయుల సంఖ్యే అధికంగా ఉన్నందున స్థానికతను పరిగణనలోకి తీసుకోకుంటే టీచర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోయారు. ప్రస్తుతం రూపొందిస్తున్న సీనియారిటీ జాబితాలోని తప్పులను సవరించాలని కోరారు. అంతర్ జిల్లా ఉపాధ్యాయుల విషయంలో జిల్లా సర్వీస్నే ప్రామాణికంగా తీసుకోవాలని విన్నవించారు. తమ వినతికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సానుకూలంగా స్పందించారని టీపీటీయూ నేతలు తెలిపారు.