Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో అన్నదాతల మరణమృదంగం మోగుతుందని టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయినా రాష్ట్ర ప్రభు త్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళ వారం ఆయన ట్వీట్టర్ వేదికగా స్పందించారు. 'రుణమాఫీ లేదు.పంటను కొనే నాథుడు లేడు. అమ్మిన పంట సొమ్ముల కోసం కండ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఇంటి ముందు అప్పులోడి లొల్లి. సమస్య పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి మాత్రం తీర్థయాత్రలు, రాజకీయ భేటీలతో బిజీగా ఉన్నారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.