Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు దాసోజు విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ గుడులు, గోపురాలను తిరుగుతున్నారనీ, అమరవీరుల కుటుంబాలను పరామర్శించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కోరారు. రాష్ట్రసాధనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలతో కలసి మంగళవారం గన్‌పార్క్ వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారులు పాశం యాదగిరి, గాదె ఇన్నయ్యతో కలసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ ఏ ఒకరి పోరా టం వల్లనో రాలేదనీ, సబ్బండ వర్గాల ప్రజల పోరాటమని చెప్పారు. 2013 డిసెంబర్లో తెలంగాణ డెవలంప్మెంట్ ఫోరం దాదాపు 900 మంది అమరవీరుల జాబితాను చిరునామాలతోసహా ముద్రించిందని గుర్తు చేశారు. పాశం యాదగిరి నేతృత్వంలో 2014 తర్వాత చనిపోయిన వారి వివరాలు సేకరిస్తే, 1381 మంది అమరులైనట్టు తెలిసిందని వివరించారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికంగా ఉద్యమంలో 1560మంది అమరులయ్యారని చెప్పారని గుర్తు చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కేవలం 576 మందిని మాత్రమే అమరవీరులని గుర్తించిందన్నారు. అమరవీరుల స్థూపం నిర్మాణంలో కూడా ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. అమరులకు గౌరవం, వారి కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పారు.