Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో రోజు విద్యుత్‌పై మంత్రుల సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రప్రభుత్వ విధానపర నిర్ణయాల వల్లే రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్ర నష్టాల్లోకి వెళ్తున్నాయని మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన సమీక్షా సమావేశం అభిప్రాయపడింది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి విద్యుత్ చార్జీల టారిఫ్ ప్రతిపాదనల సమర్పణను సమీక్షిం చేందుకు మంగళవారం కూడా ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇదే అంశంపై సోమవారం బీఆర్కే భవన్లో బేటీ అయిన మంత్రులు, ఉన్నతాధికారులు మంగళవారం అరణ్య భవన్లో సమీక్ష నిర్వహించారు. టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు, ఇంధన శాఖ కార్యదర్శి సునీల్‌శర్మ, జేఎమ్డీ శ్రీనివాసరావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి, టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎమ్‌డీ ఏ గోపాలరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈఆర్సీకి సమర్పిం చాల్సిన టారిఫ్ ప్రతిపాదనలపై చర్చించారు. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాతే వాటిని విద్యుత్ నియంత్రణ మండలికి ఇవ్లాని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వ పలు విధానపర నిర్ణయాలను సమీక్షించారు. గ్రీన్ ఎనర్జీ సెస్‌ను రూ.50 నుంచి రూ.400 పెంచారనీ, దీనివల్ల గడచిన ఏడేండ్లలో డిస్కంలపై రూ.7,200 కోట్లకు పైగా అర్థికభారం పడిందన్నారు. తెలంగాణ డిస్కంలు థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి ఏటా 50 వేల మిలియన్ యూనిట్లను ప్రతి సంవత్సరం కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు, కష్ణపట్నం విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి కొనుగోలు ఒప్పందాల వల్ల కూడా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తున్నదని అధికారులు చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడే నాటికే డిస్కంలు రూ. 12,185 కోట్ల నష్టాలతో ఉన్నాయన్నారు. ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌పై ఏటా రూ.18,167 సబ్సిడీని ప్రభుత్వం చెల్లిస్తున్నదని వివరించారు. సాధ్యమైనంత వరకు వినియోగదారులపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ, 200 యూనిట్ల వరకు గహ వినియోగదారులకు సబ్సిడీలు ఇస్తున్నట్టు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామనీ, దోబీఘాట్లు, హెయిర్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు ధరలను ఏటా ఆరు నుండి పది శాతం పెంచిందనీ, దీనివల్ల ఏటా రూ.725 కోట్లు భారం డిస్కంలపై పడుతున్నదన్నారు.