Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అల్లం నారాయణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చే ఆర్థిక సహాయానికి ఎంపికైన లబ్ధిదారులకు బుధవారం చెక్కులను పంపిణీ చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. ఆర్థిక సహాయం కోసం వచ్చిన దరఖాస్తులను సంబంధిత కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిందని వివరించారు. కోవిడ్-19తో మరణించిన 65 మంది, సాధారణ మరణం చెందిన 40 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో పాటు ఎనిమిది మంది తీవ్ర అనారోగ్యం/పని చేయలేని స్థితిలో ఉన్న వారికి చెక్కులను పంపిణీ చేయనున్నట్టు వివరించారు. బుధవారం ఉదయం 11 గంటలకు మాసబ్ ట్యాంక్ లోని సమాచార భవన్లోని మీడియా అకాడమీ కార్యాలయంలో ఈ చెక్కులను పంపిణీ చేస్తామని తెలిపారు.