Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్‌బీయూ), బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బెఫి) ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో నిర్వహించ తలపెట్టిన సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్టు తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటీవ్ యూనియన్(టీఎమ్‌ఎస్‌ఆర్‌యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.రాజుభట్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బ్యాంకుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి సంతకాలు సేకరించి ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్‌కు అందజేసే కార్యక్రమానికి మద్దతిస్తున్నామని పేర్కొన్నారు. మోడీ సర్కారు దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన ప్రభుత్వరంగ బ్యాంకులను అభివృద్ధి ముసుగులో ప్రయివేటీ కరించేందుకు పూనుకోవడాన్ని తప్పుబట్టారు. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి ప్రజలు దాచుకున్న డబ్బుకు రక్షణ కల్పించారని గుర్తుచేశారు.