Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ఉన్నత విద్య గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులుగా ఎం లక్ష్మారెడ్డి ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా జి వెంకటేశ్వర్లు, సలహాదారులుగా రాజేందర్‌సింగ్, బి జయప్రదబాయి, శ్రీనాథ్, గౌరవాధ్యక్షులుగా ఎ పుల్లయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా జి యాదగిరి, ఉపాధ్యక్షులుగా పి పద్మలత, ఎల్ భీంసింగ్, పిఎం ప్రసన్నలత, రఘు, కోశాధికారిగా ఎం విజరుకుమార్తోపాటు జాయింట్ సెక్రెటరీలుగా, ఆర్గనైజింగ్ సెక్రెటరీ, మహిళా కార్యదర్శులు, కల్చరల్ సెక్రెటరీని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి టీజీవో నగర అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, కార్యదర్శి లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారులందరూ ఉన్నత విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అందరికీ సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యంపై అవగాహన పెరగాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనీ, ఉద్యోగావకాశాలు కల్పించాలని అన్నారు. నిరుద్యోగ సమస్యను అధిగమించాలని చెప్పారు. గెజిటెడ్ అధికారుల సంఘంతో కలిసి పనిచేస్తామంటూ కళాశాల, సాంకేతిక, ఇంటర్ విద్య శాఖల అధికారులు చేరారు.