Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొప్పుల చందు గౌడ్ బీసీ విద్యార్థి సంఘం స్టేట్ కోఆర్డినేటర్
హైదరాబాద్ : ప్రస్తుతం 2021లో దేశవ్యాప్తంగా జనగణనను చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కులాలను లెక్కిస్తూ బీసీ కులాలను మాత్రం లెక్కించేదిలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. ఇది చాలా అన్యాయమని గౌడ్ బీసీ విద్యార్థి సంఘం స్టేట్ కోఆర్డినేటర్ కొప్పుల చందు గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1872 నుంచి 1941 వరకు అప్పటి బ్రిటిష్ పాలకులు పది సంవత్సరాలకు ఒకసారి చేపట్టారనీ, కానీ ఆ తర్వాత ఏర్పడిన భారత ప్రభుత్వల జనగణన చేపట్టిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ గణాంకాలు చేపట్టి బీసీలను మాత్రం విస్మరించారని విమర్శించారు. కావాలనే బీసీలను అణచివేయడానికి ఒక పట్టిక పెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి మనసు ఒప్పుకోవడం లేదు. రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కోర్టులు సమస్త బీసీ సమాజం బీసీ గణన నిర్వహించాల్సిందేనని పట్టుబడుతున్న కేంద్రం మొండిగా గుడ్డిగా ఒప్పుకోవడం లేదు. ఈ అంశంపై అధికార పక్షాన్ని అన్ని పార్టీలు నిగ్గదీసి అడగాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీలో మంగళవారం బీసీల జంగ్ సైరన్ నిర్వహించినట్టు తెలిపారు.