Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌ట్రాన్స్‌కో, జెన్కో సీఎమ్‌డీకి 1104 యూనియన్ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన సవరణ కోసం పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) కోరింది. ఈ మేరకు మంగళవారంనాడిక్కడి విద్యుత్ సౌధలో టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావును యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేమూరి వెంకటేశ్వర్లు, జీ సాయిబాబు, అదనపు ప్రధాన కార్యదర్శులు సీహెచ్ శంకర్, వరప్రసాద్, టీఎస్ఎస్పీడీసీఎల్ కంపెనీ విభాగ అధ్యక్షులు ఏ వేణు, టీఎస్‌ట్రాన్స్‌కో శాఖ అధ్యక్ష, కార్యదర్శులు తులసీరామ్, బాలకష్ణ, రామ్ చందర్ తదితరులు కలిసి వినతిపత్రం సమర్పించారు. 2018 ఏప్రిల్ 1న చేసుకున్న వేతన సవరణ ఒప్పందం గడువు 2022 మార్చి 31తో ముగుస్తుందనీ, కొత్త వేతన సవరణ కసరత్తు కోసం కమిటీని నియమించాలని కోరారు. విద్యుత్ ఉద్యోగులతో పాటు ఆర్టిజన్లు, పెన్షనర్లకు కూడా వేతన సవరణ జరగాల్సి ఉందన్నారు. ప్రధానంగా వేతనం, డీఏ, ఇతర అలవెన్సుల సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎమ్డీతో చర్చించినట్టు యూనియన్ ప్రధాన కార్యదర్శి జీ సాయిబాబు తెలిపారు.