Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయాలతోపాటు పలు అంశాలపై చర్చ
- మాజీ గవర్నర్ నరసింహన్ కుటుంబ సభ్యులకు పరామర్శ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తమిళనాడు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మంగళవారం ఆరాష్ట్ర సీఎం స్టాలిన్‌తో చెన్నైలో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతోపాటు పరిపాల నకు సంబంధించిన పలు అంశాలపై వారిరువురూ చర్చించినట్టు సమాచారం. గతంలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ నినాద మిచ్చిన కేసీఆర్... ఆ క్రమంలో స్టాలిన్‌తో చర్చలు జరిపిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా వారిరువురి భేటీ మరోసారి ప్రాధాన్యతను సంతరించుకు న్నది. సీఎంవెంట మంత్రికేటీఆర్, ఆయన సతీమణి శైలిమ, ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌కుమార్, కేసీఆర్ సతీమణి శోభ, మనవడు హిమాన్షు, మనవరాలు అలేఖ్య తదితరులున్నారు. మొదట స్టాలిన్, కేసీఆర్ కుటుంబ సభ్యులు పరస్పరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కలిసి ఫొటోలు దిగారు. అనంతరం ఇరువురు సీఎంలు ఏకాంతంగా భేటీ అయినట్టు తెలిసింది. మరోవైపు తెలంగాణ మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న ఆయన్ను చూసి, కుటుంబ సభ్యులను పరామర్శించేందుకే సీఎం అక్కడికి వెళ్లినట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. నరసింహన్ ఐసీయూలో ఉన్న నేపథ్యంలో... ఆయన్ను కేసీఆర్ దూరంగా చూడటానికే వైద్యులు అనుమతినిచ్చినట్టు సమాచారం. అనంతరం ఆయన నరసింహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బుధవారం కేసీఆర్... ఎమ్ఎన్ఎమ్ అధ్యక్షడు, సినీ నటుడు కమలహాసన్‌తో భేటీ అయ్యే అవకాశాలున్నాయని సీఎంవో వర్గాలు తెలిపాయి. ఆ సమావేశానంతరం ఆయన తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరనున్నారని సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా స్టాలిన్‌ను కేసీఆర్ కోరినట్టు సమాచారం.