Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 కిలోలు తరుగు తీస్తే ఎలా బతకాలి..?
- ధాన్యానికి నిప్పు పెట్టి.. రైతుల రాస్తారోకో
- మిల్లర్ల దోపిడీపై ఆగ్రహం
నవతెలంగాణ- కామారెడ్డి టౌన్
నిన్న మొన్నటి వరకు వడ్లలో తేమ శాతం ఎక్కు వగా ఉందని తాలు గింజలు అధికంగా ఉన్నాయని.. రంగు మారాయని వివిధ కారణాలతో ధాన్యం కాంటాలు వేయకుండా రైతులను ఇబ్బంది పెట్టిన అధికారులు.. ఆ తర్వాత కాంటా వేసినా మిల్లుకు చేరాక మిల్లర్లు క్వింటాకు 12 కిలోల వరకు కోత విధిస్తున్నారు.. మరోవైపు కొత్తగా ఔటన్ పేరుతో లారీకి 6 నుంచి 12 బస్తాల వరకు కోత విధిస్తు న్నారు.. ఇవన్నీ పోతే ఇక మాకేం మిగులుద్ది.. కష్ట మంతా దోచుకుంటున్నారని అన్నదాత కన్నీటి పర్యం తమయ్యాడు. ఇంతగనం ఆగం చేసేకంటే.. గింత ఇసమన్నా.. ఉరి తాళ్లన్నా ఇవ్వండి.. చచ్చిపోతాం అంటూ రోడ్లపై ఆందోళనకు దిగారు. ఈ ఘటనలు కామారెడ్డి జిల్లాలో మంగళవారం జరిగాయి.
రైస్‌మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచలో రైతులు రోడ్డెక్కారు. సిరిసిల్ల- కామారెడ్డి రహదారిపై బైటాయించి.. అడ్డంగా కంచె వేసి ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. 40 కిలోల ధాన్యం బస్తాకు 3 నుంచి నాలుగు కిలోలు తరుగు తీస్తున్నారన్నారు. క్వింటాలుకు దాదాపు 12 కిలోల తరుగు పోతుందని, ప్రభుత్వం చెప్పినట్టుగా ఒకటిన్నర కిలోల తరుగు తీయడం లేదని వాపోయారు. రైస్ మిల్లర్లు నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషికి పత్తి మందు సీసా, ఉరి తాడు ఇవ్వండి చచ్చిపోతాం ఇంతగానం ఇబ్బంది పెట్టుడు ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తినడానికి తిండి లేదు, పంట వేస్తే లాభం లేదు, దిక్కు లేక సచ్చిపోతున్నాం అంటూ కన్నీరు పెట్టుకున్నారు. తహసీల్దార్, పోలీసులు ఘటనా స్థలానికొచ్చి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
రైస్‌మిల్లర్ల దోపిడీపై కలెక్టర్‌కు ఫిర్యాదు
కామారెడ్డి జిల్లాలో నిన్న మొన్నటి వరకు వడ్లలో తేమశాతం ఎక్కువగాఉందని, తాలుగింజలు అధికం గా ఉన్నాయని, రంగు మారాయని వివిధ కారణాల తో కోతలు విధించిన రైస్ మిల్లర్లు ప్రస్తుతం ఔటన్ పేరుతో లారీకి 6 నుంచి 12 బస్తాల వరకు కోత విధి స్తున్నారు. తమను నట్టేట ముంచుతున్నా రని రైతు లు వాపోయారు. కామారెడ్డి మండలం అడ్లూర్ గ్రామానికి చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావుకు విన తిపత్రం అందజేశారు. తమకుఅండగా ఉంటారను కున్న అధికారులు చేతులెత్తేశారని, ఇప్పటికైనా రైస్ మిల్లులపై చర్యలుతీసుకొని కోతలు విధించిన బ్యాగు లను తిరిగి తమ ఖాతాల్లో వేయించాలని, లేకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని స్పష్టంచేశారు.