Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టుమాస్టర్ జనరల్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతులు మైక్రో ఏటీఎం ద్వారా 'రైతుబంధు' డబ్బులను పోస్టాఫీసుల్లోనూ తీసుకోవచ్చని పోస్టల్ శాఖ హైదరాబాద్ రీజియన్ తెలిపింది. రైతులు ఆధార్‌కార్డుతో లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్బుక్, ఫోన్‌నెంబర్ ఇస్తే, వారి ఖాతాల్లో జమ అయిన సొమ్మును పోస్టాఫీసులో తీసుకోచ్చని సూచించింది. ఈమేరకు బుధవారం హైదరాబాద్ రీజియన్ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా సమయంలో రైతులకు మరింత సేవలు అందించడానికి వీలుగా మైక్రో ఏటీఎం సౌకర్యాన్ని పోస్టల్ శాఖ కల్పించినట్టు వివరించింది. ఆధార్‌కార్డుకు లింక్ ఉన్న ఫోన్‌కు ఓటీపీ వస్తుందనీ, దాని ఆధారంగా రైతుబంధు డబ్బులు రైతుకు ఇస్తామని తెలిపింది. మైక్రో ఏటీఎం ద్వారా ప్రతి రోజు పదివేల రూపాయలు విత్‌డ్రా చేసుకోవచ్చని పేర్కొంది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ రైతులకు పోస్టాఫీసులు ఉచిత సేవలు అందిస్తున్నాయని తెలిపింది. వానాకాలంలో పోస్టాఫీసుల ద్వారా 2.23 లక్షల మంది రైతులకు రూ 142 కోట్లు అందజేసినట్టు గుర్తు చేసింది. యాసంగి సీజన్లోనూ తమ సేవలు రైతులు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.