Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీఆర్ జీఎమ్ గజానన్‌మాల్యా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ సమస్యల్ని అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్‌మాల్యా తెలిపారు. రైల్వే అభివృద్ధికి వారందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. సికింద్రాబాద్‌లోని రైల్‌నిలయంలో బుధవారం జరిగిన పెన్షన్ అదాలత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెన్షన అదాలత్‌లో ఆ సమస్యల పరిష్కారంతో పాటు ఇతర సమస్యలను కూడా నమోదు చేసుకోవాలని సూచించారు. దీనికోసం అకౌంట్స్ విభాగంతో కలిసి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బుధవారం పెన్షన్ అదాలత్‌కు 510 కేసులు రాగా, వాటిలో 388 పరిష్కరించినట్టు తెలిపారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే ప్రధాన ఆర్థిక సలహాదారు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.