Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శబరిమల యాత్రీకులకు రైల్వే భద్రతా సూచనలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
శబరిమల వెళ్లే రైల్వే ప్రయాణీకుల బోగీల్లో పూజలు చేయరాదని దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. శబరిమల యాత్రికుల కోసం డిసెంబర్ 16 నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాందేడ్ స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు తెలిపారు. సురక్షిత ప్రయాణం కోసం ప్రయాణికులు రైల్వే శాఖతో సహకరించాలని కోరారు. బోగీల్లో ప్రయాణికులు పూజల్లో భాగంగా కర్పూరం వెలిగించడం, అగ్గి పుల్లలు, అగరబత్తులు వెలిగించడం వంటివి చేయకూడదని చెప్పారు. రైళ్లలో మండే స్వభావం ఉండే వస్తువులను తీసుకెళ్లడం నిషేధమని పేర్కొన్నారు. రైల్వే భద్రతా చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించేవారిపై చర్యలు తప్పవనీ, ఇలాంటి నేరాలకు మూడేండ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తారని హెచ్చరించారు. రైలులో కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. ఈ మేరకు రైళ్లలో విస్త్రుతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వివరించారు.