Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో 50 శాతం మెడికల్ ఆఫీసర్ల కొరత ఏర్పడటంపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ విమర్శించింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ సాగర్, డాక్టర్ కార్తీక్, జాయింట్ ప్రెసిడెంట్ డాక్టర్ వివేక్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇన్ సర్వీస్ కోటాను పెంచటం ద్వారానే ఆ ప్రాంతాల్లో కొరత తీర్చవచ్చనే తప్పుడు సలహాలను ప్రభుత్వానికి చేరవేస్తున్నారని తెలిపారు. 2017 నుంచి శాశ్వత ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ల నియామకం చేపట్టకపోవటమే కొరతకు కారణమని అభిప్రాయపడ్డారు. 2013లో 1,190 పోస్టులు వేస్తే 9,137 మంది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు, 2017లో 525 వేస్తే 4,081 మంది, 2018లో 91 పోస్టులకు 1,215 మంది ధరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. మూడు నోటిఫికేషన్లు వేయగా మొదటి సారి ఎనిమిది మంది పోటీ పడగా, చివరి నోటిఫికేషన్ సమయానికి అది 13కు పెరిగిందని గుర్తుచేశారు. ప్రతి ఏటా ఎంబీబీఎస్ పూర్తి చేస్తున్న 5,200 మంది అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని స్పష్టం చేశారు.