Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తంగళ్ళపల్లి
తాటి చెట్టుపైన ఓ గీత కార్మికుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్దెనపల్లి గ్రామానికి చెందిన గుగ్గిళ్ల కిష్టయ్య (59) గీత కార్మికుడిగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుం టున్నాడు. రోజులాగే బుధవారం ఉదయం ఎల్లమ్మ గుడి వద్దనున్న తాటిచెట్టు ఎక్కి కల్లు గీసి కిందికి దిగుతుండగా ప్రమాదవశాత్తు మోపు జారి తన నడుముకు చుట్టుకోవడంతో తాటి చెట్టుపైనే తలకిందులుగా వేలాడాడు. అలాగే ఉండటంతో శ్వాస ఆడటం కష్టమై.. అక్కడే మృతిచెందాడు. భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ నాయుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన గీతకార్మికుడు గుగ్గిళ్ల కిష్టయ్య కుటుంబానికి తంగళ్ళపల్లి మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు చెన్నమనేని వెంకట్రావు రూ. పది వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.