Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మన రాష్ట్రం వైద్యపరికరాలను 70 శాతంపైగా దిగుమతి చేసుకునే స్థితిలో ఉన్న పరిస్థితి నుంచి గట్టేక్కించేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు తెలి పారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమను 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల పరిశ్రమగా మార్చనున్నట్టు వెల్లడిం చారు. మంగళవారం పటాన్ చెరు పరిధిలోని సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజ్ పార్కులో 265 కోట్ల పెట్టుబడిని, 1,300 ఉద్యోగాలను కల్పించే ఏడు లైఫ్ సైన్సెస్ పరిశ్రమలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రిమాట్లా డుతూ వైద్య పరికరాల దిగుమతితో వాటి ఖరీదు ఎక్కువగా ఉంటోందనీ, గతంలో తయారీ రంగానికి తగిన ప్రోత్సాహం లేని కారణంగా ఇక్కడ తయారు చేసినవాటి కంటే చైనాలో కొనుగోలు చేస్తే చవకగా దొరికేవని తెలిపారు. ముచ్చర్లలో ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్ ను, శామీర్ పేటలో అతి పెద్ద లైఫ్ సైన్సెస్ పార్కును ఏర్పాటు చేశామని తెలిపారు. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం తగ్గించేందుకు వాటిని ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలిస్తున్నట్టు చెప్పారు. 2017లో సాగుకు యోగ్యం లేని భూమిని ఎంపిక చేసి మెడికల్ డివైజెస్ పార్కును ఏర్పాటు చేశామనీ, ఇప్పటి వరకు 50 కంపెనీలు వచ్చాయని తెలిపారు.
అతి పెద్ద స్టెంట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ....
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన స్టెంట్ తయారీ కంపెనీ ఎస్ఎంటీ నిర్మిస్తోందనీ, ఇది వచ్చే ఏడాది మే నాటికి అందుబాటులోకి వస్తుందని మంత్రి వెల్లడించారు.
ఆర్టీపీసీఆర్ తయారీ కంపెనీ......
కొత్తగా అందుబాటులోకి వచ్చిన పరిశ్రమల్లో హువేల్ లైఫ్ సైన్సెస్ ఒకటి. ఈ సంస్థ కోవిడ్ సంక్షోభ సమయంలో దేశీయ ముడి పదార్థాలతో ఆర్టీపీసీఆర్ కిట్లను తయారు చేసి 20 రాష్ట్రాలకు సరఫరా చేసింది. తద్వారా కరోనా నివారణలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎక్కువగా చేసేందుకు వీలు కలిగింది. ఇందులో భాగంగా కొత్త తయారీ విభాగానికి శ్రీకారం చుట్టినట్టు ఆపరేషన్స్ హెడ్ భీష్మ బారు తెలిపారు. అదే విధంగా శరీరంలోపలి భాగాలు పాడైన సందర్భాల్లో కత్రిమ అవయవాల తయారీ కోసం ఎల్వికాన్ సంస్థ ప్రయత్నాలు మొదలెట్టింది. తాము తయారు చేసే సెన్సార్లతో ఆహారపదార్థాల నాణ్యత తెలుసుకునే వీలుందని ఆ సంస్థ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చైర్మెన్ల నియామకం....
రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లకు చైర్మెన్లను నియమించింది. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మన్నె క్రిశాంక్ ను ' తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ' కు, డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ ను ' తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్' కు, వేద సాయిచందర్ ను ' తెలంగాణ స్టేట్ వేర్ హౌజింగ్ కార్పోరేషన్' కు చైర్మెన్లుగా నియమించారు