Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గు బ్లాకుల టెండర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
- కార్మికసంఘాల జేఏసీ సమ్మె ఫలితం
నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణిలో 4బొగ్గు బ్లాకులకు ప్రకటించిన టెండర్లలో పాల్గొనడానికి కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు. దీంతో బొగ్గుబ్లాకుల ప్రయివేటీ కరణ ప్రస్తుతానికి నిలిచిపోయినట్టేనని టీబీజీకెఎస్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. సింగరేణిలోని బొగ్గు బ్లాకులను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టుబట్టింది. ప్రయివేటీకరణను నిలుపుదల చేయాలని జాతీయ కార్మిక సంఘాలు, టీబీజీకె ఎస్ చేసిన విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదు. దీంతో ఇటీవల కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో మూడ్రో జులపాటు బొగ్గు బావుల్లో కార్మికులు సమ్మె చేశారు. సమ్మె విజయవంతం అయింది. సింగరేణిలో బొగ్గు బావుల ప్రయివేటీకరణను నిలుపుదల చేయాలని సీఎం ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనడానికి ముందుకు రాలేదని టీబీజీకెఎస్ డివిజన్ ఉపాధ్యక్షులు రంగనాథ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.