Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50వ వార్షికోత్సవంలో బోసురాజు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బానిస సంకెళ్ళను తెంచి భారతదేశానికి కాంగ్రెస్ స్వాతంత్రం తెచ్చి పెడితే, 1970లో పాకిస్తాన్‌పై యుద్ధం చేయటం ద్వారా ఇందిరాగాంధీ బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రాన్ని ఇప్పించారని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు గుర్తుచేశారు. గురువారం గాంధీభవన్‌లో 'బంగ్లాదేశ్ లిబరేషన్డే 1971 విజరు దివస'్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బోసురాజు మాట్లాడుతూ పాకిస్థాన్ యుద్ధం జరిగినప్పుడు అక్కడ నుంచి లక్షలాది మంది వచ్చి ఇండియాకు వలసొచ్చి తల దాచుకున్నారనీ, వారందరిని భారత్ అదుకున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లు రవి, రాజయ్య, ఫిరోజ్‌ఖాన్, నూతి శ్రీకాంత్, మెట్టుసాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.