Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతు ఆత్మహత్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలువరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీమా పరిధిలోకి రాని రైతు కుటుంబాల్లోని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు. రైతుబంధు ఇస్తున్నా ధరణిలో లోపాల కారణంగా భూ సర్వే నెంబర్లు తారుమారై కొంతమంది రైతులకు భీమా పథకం అమలు కావడం లేదని తెలిపారు. ధాన్యం విషయంలో కేంద్రం దాగుడుమూతలు, సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడం, అకాల వర్షాలతో ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు బకాయిలు విడుదల చేయాలని తెలిపారు.