Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పైరవీలు చేయడానికే ఆఫ్లైన్ అవకాశమిచ్చారా?
- సర్కారుకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సాధారణ బదిలీలకు నెలల తరబడి సమయమిచ్చే సర్కారు లక్ష మందికి పైగా టీచర్ల భవిష్యత్తుకు సంబంధించిన బదిలీల వ్యవహారాన్ని పది పదిహేను రోజుల్లోనే పూర్తి చేయాలంటూ తొందరపెట్టడంలో అంతర్యమేంటని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. టీచర్ల బదిలీలను ఇష్టారాజ్యంగా కాకుండా హేతుబద్ధంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులను పిలిపించి, చర్చించి, వారి ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.అందుకు అనుగుణంగా జీవో తీసుకొచ్చి బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఆగమేఘాల మీద బదిలీలను చేపట్టడం వల్ల ఉపాధ్యాయుల్లో తీవ్ర గందరగోళం, అయోమయం నెలకొందని వివరించారు. ఉపాధ్యాయుల బదిలీలను ప్రభుత్వం ఆన్లైన్లో చేపడతామని ప్రకటించి ఆఫ్ లైన్లోకి మార్చడమంటే, పైరవీలకు ఆస్కారమివ్వడమే అవుతుందన్నారు.