Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విదేశాల నుంచి వచ్చిన మరో నలుగురిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్టు పరీక్షల్లో బయటపడింది. ఇప్పటికే రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసుల బాధితులుండగా వీరితో కలుపుకుని ఆరుకు చేరింది. గురువారం బయటపడిన కేసుల్లో ముగ్గురు కెన్యా దేశానికి చెందిన వారు కాగా ఒకరు భారతీయుడున్నారు. గురువారం 120 మంది విదేశాల నుంచి వచ్చారు. తాజా నాలుగు కేసుల్లో రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారు ఒకరుండగా, ముగ్గురు ఇతర దేశాలకు చెందిన వారున్నారు. మరో రెండు కరోనా పాజిటివ్ కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. ఇంకా ముగ్గురి రిపోర్టులు రావాల్సి ఉన్నవి.
190 మందికి కరోనా
రాష్ట్రంలో కొత్తగా 190 మందికి కరోనా సోకింది. ఇద్దరు మరణించారు. బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 40,103 మందికి టెస్టులు చేయగా ఈ కేసులు బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. మరో 6,118 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,805 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 80 మందికి కరోనా సోకింది.