Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు చైర్మెన్‌ను వెంటనే నియమించాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ, టి స్కైలాబ్ బాబు గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చైర్మన్‌ను, పాలక మండలి సభ్యులను నియమించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. దళితులపై ఈ మధ్యకాలంలో దాడులు, అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తుచేశారు. చైర్మెన్, పాలక మండలి సభ్యులు లేకపోవటంతో తమ సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందువల్ల చైర్మెన్ ను,పాలక మండలి సభ్యులను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.