Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జావీద్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఫలితాల్లో కేవలం 49 శాతం మంది విద్యార్థులే ఉత్తీర్ణులు కావడం ఆందోళన కలిగిస్తున్నదని తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. వారు ఫస్టియర్ ఫెయిలైన సబ్జెక్టులతోపాటు సెకండియర్ పరీక్షలను రాయాల్సి ఉంటుందని తెలిపారు. వారి మీద మానసిక ఒత్తిడి లేకుండా ఉండేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.