Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఐదు రోజుల్లో మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్పల్పంగా 8.9 డిగ్రీలు నమోదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రోజురోజుకీ చలి తీవ్రత మరింత పెరుగుతున్నది. వచ్చే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. రాష్ట్రంలో తూర్పు, ఈశాన్య దిశల నుంచి కిందిస్థాయిలో చల్లని గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలోని చాలా ప్రదేశాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. కొమ్రంభీమ్ జిల్లా గిందగారిలో 9.0 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 9.3 డిగ్రీలు, కొమ్రంభీమ్ జిల్లా సిర్పూర్(యూ)లో 9.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.