Authorization
Mon April 28, 2025 12:29:03 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఈ నెల 20వ తేదీ నుంచి జవనరి మూడో తేదీ వరకు సారస్ ఫెయిర్-2021లిను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, సెర్ప్ సీఈఓ సందీప్‌కుమార్ సుల్తానియా తెలిపారు. ఫెయిర్ ప్రారంభానికి రావాలని కోరుతూ ఆయన గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ను కలిసి ఆహ్వానించారు. 20 ఏండ్ల నుంచి నిర్వహిస్తున్న ఈ ఫెయిర్ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి, మార్కెటింగ్ సదుపాయాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు.