Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోనియా సమక్షంలో చేరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ గులాబీ పార్టీని వీడి హస్తం గూటికి చేరబోతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్టు తెలిసింది. మరోవైపు డీఎస్ కుమారుడు, ఎంపీ అరవింద్ బీజేపీలో కొనసాగు తుండటం గమనార్హం. ఇలా తండ్రీ కొడుకులిద్దరూ భిన్న ధృవాలున్న కాంగ్రెస్, బీజేపీలో కొనసాగనుండటం కొసమెరుపు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్... 1989 నుంచి 2015 జులై వరకు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక పదవులు నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగారు. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీకాలం జూన్‌తో ముగియనుంది. అయితే ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్‌తో పొసగక... ఆయన గులాబీ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే.