Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాటు చేయనున్న జెన్‌పాక్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన జెన్‌పాక్ సంస్థ... వరంగల్ నగరంలో టెక్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధి బృందం బుధవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి సెంటర్ ఏర్పాటు గురించి వివరించింది. ఇదే సమయంలో ఆ సంస్థ సీఈవో, మంత్రి కేటీఆర్‌తో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... టెక్ సెంటర్ ఏర్పాటుతో వరంగల్‌లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి గొప్ప భరోసా లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తద్వారా అనేక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. వరంగల్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో పరిశ్రమలను విస్తరించేందుకు ముందుకొచ్చే సంస్థలకు తమ ప్రభుత్వం సహాయ, సహకారాలను అందిస్తుందని తెలిపారు.