Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తొలిసారిగా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన హైదరాబాద్‌లోని పారామౌంట్ కాలనీలో కరోనా ఆంక్షలు విధించారు. జీహెచ్ఎంసీ, వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఒమిక్రాన్ కేసులు బయటపడిన వారి నివాసాలకు సమీపంలోని 25 ఇండ్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 12న కెన్యా, సోమాలియా దేశాల నుంచి నగరానికి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్దారణ అయిన విషయం తెలిసిందే. వారికి గచ్చిబౌలిలోని టిమ్స్‌లో చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ బయటపడిన నేపథ్యంలో కాలనీలో 25 హెల్త్ టీమ్స్ 700 ఇండ్లలో 136 మంది నుంచి నమూనాలను సేకరించారు. వాటిని ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం పంపించినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఆర్టీ-పీసీఆర్‌లో పాజిటివ్ వస్తే, నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి శాంపుల్స్ పంపించాల్సి ఉంటుందని తెలిపారు.