Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అవయవమార్పిడి తర్వాత రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిమ్స్ లో 2014 నుంచి ఎనిమిదేండ్లలో రికార్డు స్థాయిలో 742 కిడ్నీమార్పిడి శస్త్రచికిత్సలు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా అక్కడి డాక్టర్లను ఆయన అభినందించారు. ఈ ఏడాది వంద కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తే అందులో 97 ప్రభుత్వమే ఉచితంగా నిర్వహించిందనీ, వీటిలో 90 ఆరోగ్యశ్రీ కింద జరిగాయని చెప్పారు.