Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం వేతనాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఉత్తర్వులు విడుద ల చేశారు. ఈ ఏడాది జూన్ నుంచి పెరిగిన జీతం వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీవోను సవరించాలి. ఎన్హెచ్ఎం ఉద్యోగుల వేతనాల పెంపుపై జీవో జారీ కావటమనేది తమ పోరాట ఫలితమేనని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపాల్, కె.యాదానాయక్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత మూడు పీఆర్సీల్లో బేసిక్ పే సాధించుకున్నామనీ, అదే ఆనవాయితీ ప్రకారం ఆయా కేడర్లకు బేసిక్ పే వచ్చేలా జీవోను సవరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.