Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులు, గాంధీ ఆస్పత్రికి హైకోర్ట్ నోటీసులు
- గిరిజన యువకుడి మృతి కేసు..
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కామారెడ్డి జిల్లా బిచ్చుందు మండలం శాంతాపూర్‌లో భూం బోయి అనే వ్యవసాయ కార్మికుడు పోలీసులు కొట్టిన దెబ్బలకు చనిపోయాడనీ, అతని కుటుంబానికి రూ. 5 కోట్లు పరిహారం ఇవ్వాలని పౌర హక్కుల సంఘం, అతని భార్య లచ్చవ్వ వేసిన రిట్లపై హైకోర్టు స్పందించింది. బిచ్చుకొండ పోలీసులకు, గాంధీ ఆస్పత్రికి నోటీసులు జారీ చేసింది. భూంబోయి గాంధీ ఆస్పత్రిలో చేరినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో, అతనికి ఏమి వైద్యం అందజేశారో, పోస్టుమార్టం చేసిన రిపోర్టును అందజేయాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. భూం బోయి కేసుకు సంబంధించిన డైరీని అందజేయాలని బిచ్చుండ పోలీసులను ఆదేశించింది. భూం బోయి వడ్లను ఆరబెట్టికుని కూర్చుంటే పోలీసులు శాంతాపూర్ గ్రామానికి వచ్చి అతనిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టారనీ, పోలీసుల దెబ్బల కారణంగానే చనిపోయాడని పిటిషనర్ లాయర్ రఘునాథ్ వాదించారు. భూం బోయి భార్య లచ్చవ్వ, పౌరహక్కుల సంఘం పిటిషన్లను జస్టిస్ బీ విజరుసేన్‌రెడ్డి గురువారం విచారణ జరిపి ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. శాంతాపూర్ గ్రామంలో పేకాడుతున్నారని తెలిసి అన్ని వైపుల నుంచి పోలీసులు గ్రామంలోకి వచ్చారని, అక్కడి వారు తలో దిక్కుకు పారిపోయారని, అయితే వడ్లను ఆరబెట్టుకున్న భూం బోయి అక్కడే ఉండటంతో అతనిని విచక్షణారక్షితంగా పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా కొట్టారని న్యాయవాది వాదించారు. మతుడి కుటుంబసభ్యులకు రూ. 5 కోట్లు పరిహారం ఇవ్వాలని, దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. తదుపరి విచారణ ఈ నెల 22కి వాయిదా పడింది.