Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
రూ.2 లక్షల రివార్డు గల బద్రీ అలియాస్ దేవా అనే మహిళా మావోయిస్టు గురువారం సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. దోర్నపాల్ గ్రామానికి చెందిన దేవా పదిహేనేండ్లుగా సీపీఐ(మావోయిస్టు)లో పనిచేస్తోంది. ప్రభుత్వ పునరావాస విధానం, సుక్మా పోలీసుల పూనా నార్కోమ్ ప్రచారంతో ప్రభావితమవడంతో పాటు మావోయిస్టు సంస్థలో వివక్షతో బద్రీ విసిగిపోయి లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ మహిళా మావోయిస్టు.. దక్షిణ బస్తర్ డివిజన్ మెడికల్ టీమ్ కమాండర్ (ఏసీఎం ర్యాంక్)గా ఉన్నారు. ఆమెపై ప్రభుత్వం రూ.2లక్షల రివార్డు ప్రకటించింది. కోబ్రా 208 కార్ప్స్, డిస్ట్రిక్ట్ ఫోర్స్ సంయుక్త ప్రయత్నాలు ఫలించాయని ఉన్నతాధికారులు తెలిపారు.