Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశాల వేతనాలు పెంచాల్సిందే..
- కరోనా కష్టకాలంలో ముందుండి సేవ చేస్తే.. గుర్తింపేది?
- ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి
- సంగారెడ్డి జిల్లాలో ఆశా కార్మికుల పోరుగర్జన పాదయాత్ర
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఆశా వర్కర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు తప్ప వారి సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు.. పనికి తగిన వేతనం ఇవ్వడం లేదని తెలంగాణ వాలంటీర్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఆశా కార్యకర్తల పోరుగర్జన పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా జయలకిë మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ప్రాణానికి తెగించి విధులు నిర్వర్తించిన ఆశాలకు ఎలాంటి గుర్తింపు లేకపోవడం అన్యాయమన్నారు. ఆశాలకు వేతనాలు పెంచుతున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ.. ఆచరణలో పారితోషికాలు మాత్రమే ఇస్తున్నదన్నారు. వారికి కనీస వేతనం రూ.21వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో రెండేండ్లుగా ప్రజల ఆరోగ్యం కోసం ముందుండి సేవ చేసినందుకు కేంద్ర ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తే.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం తన జేబులో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. పెండింగ్‌లో ఉన్న కోవిడ్ రిస్క్ అలవెన్సులను వెంటనే ఆశాల అకౌంట్లలో జమ చేయాలన్నారు. ప్రజల ఆరోగ్య సర్వేలు చేయడానికి అవసరమైన రికార్డులు, రిజిస్టర్లు, ఆన్లైన్ సర్వేల కోసం స్మార్ట్ ఫోన్లు, నెట్ బ్యాలెన్స్ ఇచ్చిన తర్వాతే ఆశాలకు పని చెప్పాలన్నారు. జాబ్‌చార్ట్ రూపొందించాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం,పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జయరాజు పాదయాత్రనుద్దేశించి మాటాడుతూ.. పోరాటాలతోనే హక్కులు, సౌకర్యాలు సాధించుకోగలమన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.రాజయ్య, సాయిలు, యాదగిరి, లక్ష్మయ్యా, ఆశా యూనియన్ నాయకులు వరలక్ష్మీ, మహాలక్ష్మీ, వీరమని, ప్రశాంతి, యశోదా, శశికళ, గంగ, నందమ్మ, వర్కర్లతో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.