Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
హైదరాబాద్ సిటీలోని టోలిచౌకి పరిధి పారామౌంట్ కాలనీని జీహెచ్ఎంసీ, హెల్త్ డిపార్టుమెంట్ సంయుక్తంగా కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించాయి. అక్కడ నో ఎంట్రీ బోర్డు ఏర్పాటు చేశాయి. ఆ ప్రాంతంలో రెండు ఒమిక్రాన్ కేసు లు బయటపడిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. బాధితుల ఇండ్ల వద్దకు వెళ్లి ఆ కాలనీలు, పరిసరాలను కంటైన్మెంట్ ఏరియాగా గుర్తించి బోర్డులు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల 25 ఇండ్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. ఈనెల 12వ తేదీన హైదరాబాద్‌కు కెన్యా, సోమాలియా దేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ ఉన్నట్టు తేలింది. వారిని గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ టోలిచౌకి పారామౌంట్ కాలనీలో 25 హెల్త్ టీమ్‌ల ద్వారా గురువారం సాయంత్రం వరకు 7 వందలకుపైగా ఇండ్లల్లో సర్వే, కొవిడ్ టెస్టులు నిర్వహించింది. 136 మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించారు. 36 గంటల తర్వాత ఫలితాలు వస్తాయని మెడికల్ ఆఫీసర్లు తెలిపారు. ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ వస్తే గనుక శాంపుల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టు కోసం పంపుతామని హెల్త్ ఆఫీసర్లు చెప్పారు.