Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 51 శాతం మంది ఫెయిల్
- వేల మందికి పదిలోపు మార్కులే
- బెంబేలెత్తుతున్న సెకండియర్ విద్యార్థులు
- ఆన్లైన్ చదువులతో ఆగమాగం
- 49 శాతం ఉత్తీర్ణత ొ బాలికలదే పైచేయి
- ఫస్టియర్ ఫలితాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు ఎట్టకేలకు విడుదల య్యాయి. 49శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిం చారు. 51శాతం మంది ఫెయిలయ్యారు. గతంలో ఎప్పుడూ ఇంత తక్కువగా ఉత్తీర్ణత నమోదైన సందర్భం లేదు. రికార్డు స్థాయిలో ఫెయిల్ కావడం విద్యార్థులను కలచివేస్తున్నది. అందుకే 'వామ్మో ఇంటర్ ఫలితాలు'అంటూ బెంబేలెత్తుతు న్నారు. వేలాది మంది విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో పది లోపు మార్కులే రావడం గమనార్హం. ఈ ఫలితాలను చూసి విద్యార్థులు షాక్కు గురయ్యారు. చాలామంది ఫెయిలైతే, కొందరికి మార్కులు తక్కువగా వచ్చాయి. దీంతో వారు మానసికవేదనకు గురవుతున్నారు. ఇవేం ఫలితాలంటూ ఇంటర్ బోర్డుఅధికారుల తీరుపై ఆగ్రహంవ్యక్తం చేస్తు న్నారు. కరోనా నేపథ్యంలో 2021లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులందర్నీ ప్రభుత్వం పాస్ చేసింది. అప్పుడు ప్రథమ సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. వారే ఇప్పుడు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశారు. 2020లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4,80,555 మంది పరీక్షలు రాస్తే, 2,88,383 (60.01 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 2019లో 4,09,133 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,47,407 (60.47 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ప్రస్తుతం ఊరించి... ఊరించి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల ఫలితాలను ఇంటర్ బోర్డు గురువారం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4,59,242 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 2,24,012 (49 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2020 కంటే ప్రస్తుతం 11.01 శాతం తక్కువగా నమోదు కావడం గమనార్హం. ప్రస్తుత ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. అమ్మాయిలు 2,26,616 మంది పరీక్షలు రాయగా, 1,26,289 (56 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 2,32,626 మంది పరీక్షలు రాస్తే, 97,723 (42 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 14 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. జనరల్ కేటగిరీలో 4,09,911 మంది పరీక్షలు రాయగా, 1,99,786 (49 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అమ్మాయిలు 2,04,537 మంది పరీక్షలకు హాజరుకాగా, 1,12,580 (55 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిలు 2,05,374 మంది పరీక్షలు రాస్తే, 87,206 (42 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. జనరల్ కేటగిరీలోనూ అమ్మాయిలే హవా కొనసాగించారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 13 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. ఇక ఒకేషనల్ కేటగిరీలో 49,331 మంది పరీక్షలకు హాజరైతే 24,226 (49 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో అమ్మాయిలు 22,079 మంది పరీక్షలకు హాజరుకాగా, 13,709 (62 శాతం) మంది పాసయ్యారు. అబ్బాయిలు 27,252 మంది పరీక్షలు రాస్తే, 10,517 (39 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 23 శాతం అధికంగా ఉత్తీర్ణులు కావడం గమనార్హం.
మేడ్చల్ అగ్రస్థానం... మెదక్ చివరి స్థానం
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో జనరల్, ఒకేషనల్ కలిపి 51,348 మంది పరీక్షలు రాయగా, 32,106 (63 శాతం) మంది విద్యార్థులు పాసయ్యారు. ములుగు జిల్లాలో 2,051 మంది విద్యార్థులు హాజరుకాగా, 1,258 (61 శాతం) ఉత్తీర్ణత పొందడంతో రెండోస్థానంలో ఉన్నది. రంగారెడ్డి జిల్లాలో 56,682 మంది పరీక్షలు రాస్తే, 33,856 (60 శాతం) మంది ఉత్తీర్ణులు కావడంతో మూడోస్థానంలో నిలిచింది. మెదక్ జిల్లాలో 7,211 మంది పరీక్షలకు హాజరుకాగా, 1,560 (22 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఆ జిల్లా చివరిస్థానంలో నిలిచింది.
నేటినుంచి మెమోల డౌన్లోడ్కు అవకాశం : జలీల్
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలను https://tsbie.cgg.gov.in, http://examresults.ts.nic.in, http://results.cgg.gov.in వెబ్సైట్ల ద్వారా చూసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. మార్కుల మెమోలను శుక్రవారం సాయం త్రం ఐదు గంటల నుంచి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకు నేందుకు అవకాశముందని వివరించారు. ఆ మెమోలపై ఏమైనా సందేహాలుంటే ఆయా కాలేజీల ప్రిన్సి పాళ్ల ద్వారా ఈనెల 31లోగా దరఖాస్తు చేయాలని సూచిం చారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసేం దుకు ఈనెల 22వరకు విద్యార్థులకు గడువుందని పేర్కొ న్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు..
జిల్లా ఉత్తీర్ణత శాతం
1. ఆదిలాబాద్ 56
2. నిర్మల్ 55
3. ఆసిఫాబాద్ 58
4. మంచిర్యాల 35
5. పెద్దపల్లి 38
6. కరీంనగర్ 49
7. జగిత్యాల 41
8. రాజన్న సిరిసిల్ల 37
9. వరంగల్ అర్బన్ 52
10. వరంగల్ రూరల్ 41
11. మహబూబాబాద్ 33
12. భూపాలపల్లి 39
13. జనగామ 40
14. ఖమ్మం 51
15. భద్రాద్రి కొత్తగూడెం 49
16. నిజామాబాద్ 42
17. కామారెడ్డి 42
18. సిద్ధిపేట 47
19. మెదక్ 22
20. సంగారెడ్డి 48
21. నల్లగొండ 46
22. యాదాద్రి భువనగిరి 37
23. జోగులాంబ గద్వాల 34
24. సూర్యాపేట 38
25. వనపర్తి 40
26. నాగర్కర్నూల్ 36
27. మహబూబ్నగర్ 45
28. వికారాబాద్ 29
29. రంగారెడ్డి 60
30. మేడ్చల్ 63
31. హైదరాబాద్-1 48
32. హైదరాబాద్-2 52
33. హైదరాబాద్-3 48
34. ములుగు 61
35. నారాయణపేట 38
మొత్తం 49