Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలలోగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఉద్యమం : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్న జీవో నెంబర్ 317ని తక్షణమే నిలిపేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకు మార్ డిమాండ్ చేశారు. నెలలోగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ప్రభుత్వ శాఖల్లో ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.శుక్రవారం ఈ మేరకు ఆయన సీఎం కేసీర్కు బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగులు,ఉపాధ్యాయలను సర్దుబాటు చేసేందుకు తీసుకొచ్చిన జీవో317 అనాలోచిత నిర్ణయానికి నిదర్శనమని విమర్శించారు.కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల స్థానికతను ప్రామాణికంగా తీసుకోకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడం సిగ్గుచేటన్నారు. ఈ జీవోను యధాతథంగా అమలు చేస్తే పలు జిల్లాల్లో ఏండ్ల తరబడి కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉండదని తెలిపారు.ఉద్యోగుల స్థానికత, సీనియారి టీ ఆధారంగా జిల్లాలకు సర్దుబాటు చేసే అంశంపైఉపాధ్యాయ,ఉద్యోగ సంఘాలతో చర్చించాలని కోరారు.